![]() |
![]() |

కృష్ణ ముకుంద మురారి.. ఈ సీరియల్ స్టార్ మాలో ప్రసారమవుతూ ఎంతగానో పాపులర్ అయింది. ఇందులో సీనియర్ ఆర్టిస్ట్ ప్రియా మెయిన్ రోల్ చేస్తుండటంతో మరింత ప్రేక్షకాదరణ పొందింది. విభిన్న కథతో ఈ సీరియల్ ముందుకు సాగుతూ మంచి ఆదరణ పొందుతుంది.
ఈ సీరియల్ లో భవాని(ప్రియా) కొడుకు ఆదర్శ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి పేరే ముకుంద. భవానీతో పాటు తన తోటి కోడలుగా రేవతి ఉంది. రేవతి కొడుకు మురారి. అతను తన పెళ్ళికి ముందు ముకుందని ప్రేమించి ఉంటాడు. అయితే మురారి పెళ్ళి కృష్ణ అనే అమ్మాయితో జరుగుతుంది. మురారి, ముకుందలు ఒకరికొకరు ఇష్టపడ్డారు అనుకోని పరిస్థితుల వల్ల వారిద్దరి జీవితాలు తారుమరయ్యాయి. మురారి ముకుందల ప్రేమ విషయం తెలియని భవాని ఆదర్శ్-ముకుంద పెళ్లి చేసింది. ఆదర్శ్ కోసం మురారి తన ప్రేమని త్యాగం చేసాడు. కానీ ముకుంద అదే ఇంటికి కోడలు అవుతుంది. పెళ్లి తర్వాత ముకుంద ప్రేమ వ్యవహారం ఆదర్శ్ కి తెలిసి ఇంట్లో నుండి ఆర్మీకి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి తిరిగిరాలేదు. మధ్యలో అనుకోకుండా మురారి, కృష్ణలది అగ్రిమెంట్ మ్యారేజ్ అని అందరికి తెలుస్తుంది. అది ఇప్పుడు ఎన్నో క్లిష్ట పరిస్థితులని దాటుకొని పర్మినెంట్ మ్యారేజ్ అయింది. కృష్ణని పంపించి మురారి ప్రేమని పొందాలని, ఆదర్శ్ రాకూడదని ముకుంద కోరుకుంటుంది. కానీ కృష్ణ మాత్రం ఆదర్శ్ ని తీసుకొని వచ్చి ముకుంద జీవితం బాగుచెయ్యాలని చూస్తుంది.
ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ లలో.. ముకుంద అడ్డదారుల్లో మురారిని సొంతం చేసుకోవాలని ట్రై చేస్తూనే ఉంది. కృష్ణ, మురారి మాత్రం ఎలాగైన ఆదర్శ్ ని తీసుకొని వస్తామంటు బయల్దేరి వెళ్లి ఆదర్శ్ ని కలుస్తారు. ఆదర్శ్ కి రూపం మారిన మురారి విషయం గురించి కృష్ణ చెప్తుంది. మురారి, ఆదర్శ్ ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఇన్ని రోజులుగా ఇంటికి దూరంగా ఉన్న ఆదర్శ్ ఇంటికి వస్తాడా? ముకుంద ప్రేమాయణం తెలిసిన ఆదర్శ్ తనని క్షమించి భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా? ఆదర్శ్ ఇంటికి వస్తే ముకుంద ఎలా ఉండగలదు.. మురారిపై ఉన్న ముకుంద ప్రేమని త్యాగం చేయగలదా? ఇన్ని ట్విస్ట్ ల మధ్య ఈ కథ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇన్ని రోజులుగా కథలో ఆదర్శ్ లేడు. ఇప్పుడు రీఎంట్రీ ద్వారా కథ ఏ మలుపు తిరగనుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |